అప్పుకు ష్యూరిటీ ఇవ్వలేదని స్నేహితుడి గొంతు కోసి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పుల్కల్ మండలం కోడూరు గ్రామానికి చెందిన మల్లేష్, రాజు ఇద్దరు స్నేహితులు. ఇటీవల మల్లేష్ రూ.20వేలు అప్పు తీసుకోగా ష్యూరిటీ ఇవ్వాలని రాజును అడిగాడు. అయితే రాజు సంతకం పెట్టడానికి నిరాకరించాడు. దీంతో రాజు మల్లేష్ గొంతు కోసి పారారయ్యాడు. బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేశారు.