సికింద్రాబాద్: రోడ్డుపై రెడీమిక్స్ వాహనాలు.. ఇతరులకు ఇబ్బందులు

సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డుపై రెడీమిక్స్ వాహనాలు నిలిపారు. స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణానికి పదుల సంఖ్యలో రెడీమిక్స్ వాహనాలు ఉదయం నుంచి రోడ్డుపైనే పార్కింగ్ చేశారు. దీంతో ఆ దారి గుండా వెళ్లే ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం ఈ ప్రాంతం అత్యంత రద్దీగా ఉంటుంది. సంబంధిత ట్రాఫిక్ పోలీసులు స్పందించి ఇట్టి వాహనాలపై చర్యలు తీసుకోవాలని శనివారం వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్