సికింద్రాబాద్: క్రికెట్ బెట్టింగ్తో యువకుడు బలి

71చూసినవారు
సికింద్రాబాద్: క్రికెట్ బెట్టింగ్తో యువకుడు బలి
క్రికెట్‌ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌ సనత్‌నగర్‌ సమీపంలో శనివారం జరిగింది. సికింద్రాబాద్‌ సుచిత్ర ప్రాంతానికి చెందిన రజ్వీర్‌సింగ్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. తల్లిదండ్రులు చనిపోవడంతో సుచిత్ర వద్ద ఉంటున్న బాబాయి ఇంట్లో ఉంటున్నాడు. కొంత కాలంగా ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతూ డబ్బు మొత్తం పోగొట్టుకొని తాగుడికి బానిసయ్యాడు.

సంబంధిత పోస్ట్