అన్నపురెడ్డిపల్లి: ఆశ్రమ పాఠశాల, కళాశాలను తనిఖీ జిల్లా ఎస్పీ

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నపురెడ్డిపల్లిలోని సాంఘిక, సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను, కళాశాలను శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. తరగతి గదులకు వెళ్లి అక్కడ ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించి, విద్యార్థులను వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల అందరితో సమావేశమయ్యారు. హాస్టల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులు కష్టపడి చదువుకొని తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్