మధ్యాహ్నం భోజనం కావాలంటే.. తాళిబొట్టు తాకట్టు పెట్టాల్సిందే.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం, మధ్యాహ్నం భోజనం పెట్టేందుకు నిర్వాహకులకు ఆర్థికంగా భారమవుతోంది. నెలల తరబడి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో నిర్వాహకులు వడ్డీలకు ఇచ్చి పెట్టుబడులు పెడుతూ.. ఉండగా మరికొన్ని గ్రామాల్లో మెడలోని పుస్తెలతాడు తాకట్టుపెట్టి మధ్యాహ్న భోజనం పథకం నిర్వహిస్తున్నారు.

చంద్రుగొండ అన్నపురెడ్డిపల్లి రెండు మండలాల్లో మొత్తం 68 పాఠశాలలు ఉన్నాయి. 114 మంది మధ్యాహ్న భోజనాలు వండేందుకు నిర్వాహకులు పనిచేస్తున్నారు. నిర్వాహకులకు ఒక్కొక్కరికి నెలకు వెయ్యి రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. మండల ప్రాథమిక పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థికి రూ 4.43 పైసలు చెల్లిస్తున్నారు. అలాగే మండల ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ 6.25 పైసలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ 8.87 పైసలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అందులో ప్రతి విద్యార్థికి వారానికి మూడు కోడిగుడ్లు పెట్టాల్సి ఉంది. ప్రభుత్వం ఒక్క కోడిగుడ్డు కి నాలుగు రూపాయలు చెల్లిస్తుంది .

ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఫిబ్రవరి నెలాఖరు వరకు రూ. 4.59 లక్షలు బకాయిలు గా ఉన్నాయి. పలు పాఠశాలల నిర్వాహకులకు నాలుగు నెలలు మరికొన్ని పాఠశాలలో రెండు నెలలుగా గౌరవ వేతనాలు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సంబంధించిన బిల్లులు పేరుకుపోయాయి. నెలవారి వేతనాలు నిర్వహణ బిల్లులు చెల్లించకుంటే పెట్టుబడులు ఎలా పెట్టాలని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు . కిరాణా వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరిస్తున్నారని నిర్వాహకులు అంటున్నారు గత్యంతరం లేక నిర్వాహక మహిళలు కొంతమంది మెడలో పుస్తెలతాడు (బంగారం) తాకట్టు పెట్టి పెట్టుబడులు పెట్టడం గర్వనీయం ప్రభుత్వం ఒక గుడ్డు కి 4 రూపాయలు చెల్లిస్తున్న మేము 5 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నాం ఒక్కొక్క విద్యార్థిపై మాకు ఒక రూపాయి భారంగా పడుతుంది . ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించి ఆదుకోవాలని నిర్వాహకులు వేడుకుంటున్నారు.

మధ్యాహ్న భోజనానికి సంబంధించి నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంతో పుస్తెలతాడు తాకట్టుపెట్టి తాకట్టు ద్వారా 50 వేలు రూపాయలు వచ్చాయి అదే పెట్టుబడి పెట్టి మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నాము కిరాణా వ్యాపారులు అప్పు పెట్టడానికి నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం కోడి గుడ్డుకు నాలుగు రూపాయలు ఇస్తే మేము ఐదు రూపాయలు పెట్టి విద్యార్థులకు పెడుతున్నాము. గౌరవ వేతనం మధ్యాహ్న భోజన బకాయిలు వెంటనే చెల్లించాలి.

సంబంధిత పోస్ట్