జాతీయ ఆదివాసీ అభ్యుదయ సంఘం 50వ వార్షికోత్సవాలు భద్రాచలంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సంఘాల జేఏసీ చైర్మన్ చందా లింగయ్య దొర అధక్షతన రెండు రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవి శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ ప్రారంభించారు. ఈ సంఘంలో గతంలో పనిచేసిన తాను 50 ఏళ్ల వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సమష్టి అభివృద్ధికి కృషి చేద్దామని వీరయ్య పిలుపునిచ్చారు.