30న భద్రాద్రి రామయ్య హుండీ లెక్కింపు: ఈవో

భద్రాద్రి రామాలయంలో హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను ఈ నెల 30న లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 26న హుండీ లెక్కింపు నిర్వహిస్తామని ప్రకటన చేసిన తరువాత ఈ నెల 30కు లెక్కింపు కార్యక్రమాన్ని మార్చడం జరిగిందన్నారు. దేవస్థానంలోని చిత్రకూట మండపంలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్