దుమ్ముగూడెం మండలంలోని బొజ్జికుప్ప, నారాయణరావుపేట గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసుకునేందుకు ఆదివాసీలు సూచనలు ఇవ్వాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ కోరారు. స్టూడియో, పంచతంత్ర బృందాలతో కలిసి ఆయన ఆదివారం పర్యటించారు. బొజ్జికుప్ప, నారాయణరావుపేట గ్రామాలను సందర్శించారు. అక్కడ పర్యాటకులు బసచేసేలా వెదురుతో నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఆదివాసిలతో కలిసి నృత్యం చేశారు.