భద్రాచలం: డ్రైనేజీ, కరెంటు పనులు పూర్తి చేయండి

భద్రాచలం పట్టణంలో పెండింగ్‌లో ఉన్న పనులపై ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటించారు. కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకొని, వినతిపత్రాలు స్వీకరించారు. ముఖ్యంగా అశోక్ నగర్, ఏఎంసీ కాలనీ, జగదీష్ కాలనీ, సుభాష్ నగర్ కాలనీల్లో పర్యటించి డ్రైనేజీ కాలువలు, కరెంటు స్తంభాల పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీ ఈవో, అధికారులు, మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్