విద్యార్థులు ఒకరినొకరు గౌరవించుకుంటూ క్రమశిక్షణతో కూడిన క్రీడా స్ఫూర్తిని చాటాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ , పాల్వంచలో 10 వ రాష్ట్రస్థాయి క్రీడపోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మహనీయుల చిత్రపటాలకు ఘనంగా నివాళులు అర్పించారు.