అశ్వాపురం: పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డిఎస్పీ

అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి వార్షిక తనిఖీ నిర్వహించారు. ముందుగా ఆయన పోలీసు సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి స్టేషన్ పరిసరాలను క్రైమ్ రికార్డులను పరిశీలించారు. ముఖ్యమైన నేరాల విషయంలో దర్యాప్తు పురోగతిని డిఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీసులు ఎప్పుడు ప్రజల రక్షణనే ధ్యేయంగా పనిచేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్