సింగరేణి యాజమాన్యం గని కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ అన్నారు. శుక్రవారం మణుగూరు టౌన్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణపై లేదని మండిపడ్డారు. ఓసి 2లో జరిగిన ప్రమాదంలో మరణించిన మూల్ చంద్ కుటుంబానికి రూ.2 కోట్ల నష్టపరిహారం, ఆయన మృతికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.