టేకులపల్లి మండలంలో పెట్రాంచె లకస్టేజీకి చెందిన బానోత్ వెంకటేశ్(27)కు తల్లిదండ్రులు లేరు. అతని చిన్నమ్మ ఇంటి వద్దనే ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. గత కొంతకాలంగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఖమ్మం తరలించారు. పరిస్థితి విషమించడంతో వెంకటేశ్ శుక్రవారం మృతి చెందాడు.