మాయలఫకీర్‌లా సీఎం రేవంత్ డ్రామాలు: జేపీ నడ్డా

మాయలఫకీర్‌లా రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా మండిపడ్డారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. హామీల అమలులోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. తెలంగాణకు పన్నుల కింద కేంద్రం రూ.లక్షా 60 వేల కోట్ల సాయం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ 3 వందేభారత్ రైళ్లు, హైవేల కింద ఐదు భారత్ మాల ప్రాజెక్టులు ఇచ్చినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్