భారత ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో ఆసీస్ మాజీ కెప్టెన్ ఈసారి తాను అప్లై చేయడం లేదంటూ స్పష్టంచేశాడు. ‘‘భారత ప్రధాన కోచ్ పదవి అత్యంత క్లిష్టమైందని ఇప్పటికే చెప్పా. బాధ్యతలు చేపట్టిన వ్యక్తిపై భారీ అంచనాలు ఉంటాయి. అయితే, నేను ఇప్పుడు ఈ స్థానంలో పని చేసేందుకు సిద్ధంగా లేను. తప్పకుండా భవిష్యత్తులో దరఖాస్తు చేసుకొనే అవకాశం లేకపోలేదు’’ అన్నారు.