సంగారెడ్డి: నిరుపేద రైతుల కష్టం నేలపాల్

టమాటకు మద్దతు ధర కల్పించాలని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండల పరిధిలోని బోరంచ రైతులు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం టమాట పొలంలో రైతులు మాట్లాడుతూ.. లాభాలు వస్తాయని రెండు ఎకరాలలో టమాటా వేసి పెట్టుబడి పెడితే పూర్తిగా ధర పడిపోయిందని ఆందోళన చెందారు. మార్కెట్ లో పెట్టే ధర రూ. 50 తీసుకుంటున్నారని అన్నారు. మందుల ధరలు ఆకాశాన్ని అంటుకుంటే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని వాపోయారు.

సంబంధిత పోస్ట్