కశ్మీర్‌లో వింత వ్యాధితో వరుస మరణాలు

జమ్మూకశ్మీర్‌ రాజౌరీలోని బధాల్‌ గ్రామంలో ఓ వింత వ్యాధితో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి వల్ల నెల రోజుల వ్యవధిలోనే 17 మంది మరణించారు. మృతుల్లో 13 మంది పిల్లలు ఉండగా నలుగురు పెద్దలు ఉన్నారు.  దీంతో ఈ అనుమానాస్పద మరణాలతో ప్రభుత్వం తల పట్టుకుంది. ఈ క్రమంలో మిస్టరీ మరణాల గుట్టు విప్పేందుకు తాజాగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.

సంబంధిత పోస్ట్