భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్‌ స్టాక్స్‌ సూచీలను ముందుండి నడిపించాయి. దీంతో వరుసగా ఆరో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ సూచీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 1078 పాయింట్స్ లాభపడి 77,984 వద్ద ముగిసింది. నిఫ్టీ 307 పాయింట్స్ లాభపడి 23,658 వద్ద ముగిసింది. దీంతో ఎన్టీపీసీ, కోటక్‌ మహీంద్రా, SBI, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి.

సంబంధిత పోస్ట్