భారత్‌కు చెందిన సంస్థపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరానియన్ పెట్రోలియం, పెట్రో కెమికల్స్‌తో కలిసి వ్యాపారం చేస్తోందని ఆరోపిస్తూ అట్లాంటిక్ నావిగేషన్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్‌పై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. ఇరాన్‌కు బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుస్తున్న 4 సంస్థలు, 3 నౌకలపై ఆంక్షలు విధించామని యూఎస్ ట్రెజరీ శాఖ పేర్కొన్నారు.ఇరాన్ తన అణు కార్యక్రమం అభివృద్ధికి, ఆయుధ వ్యవస్థల విస్తరణకు, ప్రాక్సీలకు మద్దతు ఇవ్వడానికి నౌకలు, కంపెనీలపై ఆధారపడుతోందన్నారు.