ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అడవుల్లో వీచిన సుడిగాలి దుమారం (టోర్నడోలు)వల్ల భారీగా చెట్లు నేలకూలి అడవిలో నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ గాలి దుమారం తాడ్వాయి గ్రామ పంచాయతీ పరిధిలోని కొండపర్తి ఊరి చివర ఉన్న 16 ఇండ్లను తాకిపోయింది. దీంతో 16 ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనతో కొండపర్తి గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. అక్కడి వారు బిక్కుబిక్కు మంటూ గడిపినట్లు గ్రామస్తులు వాపోయారు.