న్యాయవాద వృత్తిలో ఉన్నవారు నిబద్ధత, నిజాయితీ కలిగి ఉండి జ్ఞానాన్ని పెంచుకోవాలని మాజీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డా. జి. చంద్రయ్య అన్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం లా అండ్ హ్యూమన్ రైట్స్ పై అవగాహన కార్యక్రమంలో వారితో పాటు మాజీ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. ఎస్. నారాయణ పాల్గొని న్యాయవాదులకు చట్టాలపై అవగాహన, అమలు చేసే విధానాలపై వారి అనుభవాలను తెలిపారు.