మాజీ సర్పంచుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: హరీశ్

పెండింగ్ బిల్లులు చెల్లించాని కోరుతూ, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వస్తున్న మాజీ సర్పంచుల సంఘం నాయకులను, మాజీ సర్పంచులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BRS నేత హరీశ్ రావు తెలిపారు. వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటం దుర్మార్గమన్నారు. సీఎం/పంచాయతీ శాఖ మంత్రి.. మాజీ సర్పంచులను చర్చలకు పిలవాలని, వారి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్