యూపీలోని బరేలీలోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రామగంగా నది ఖాదర్ ప్రాంతంలో జాతీయ పక్షి నెమలిని ఓ యువకుడు వేటాడుతుండగా గ్రామస్థలు పట్టుకొని ఘోరంగా కొట్టారు. కొట్టవద్దని ఎంత వేడుకున్నా వదల్లేదు. ఆమ్లా రేంజ్ ఫారెస్ట్ ఇన్స్పెక్టర్ అవనేష్ గంగ్వార్ ఆదివారం సాయంత్రం ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా అవుతోంది.