విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బిహార్‌కు చెందిన చందన్ కుమార్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలెట్‌గా పని చేస్తున్నాడు. విధుల నిమిత్తం గత ఐదేళ్లుగా భార్యాపిల్లలతో గోపాలపట్నం పరిధిలోని కొత్తపాలెంలో నివాసముంటున్నాడు. ఇంట్లో అల్లరి చేస్తున్న పిల్లలను కొట్టబోతుండగా భార్య అడ్డుపడింది. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అతని మాటలు ఎవరూ పట్టించుకోలేదు. చీర కట్టి మెడకు చుట్టి బెదిరించే ప్రయత్నం చేయగా.. అది పొరపాటున మెడకు బిగుసుకుపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.