AP: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను క్రీడల్లోనూ తీర్చిదిద్దాలని విద్యాశాఖ భావిస్తోంది. పిల్లలోని ప్రతిభను వెలికి తీసేందుకు ‘యాక్టివ్ ఆంధ్ర’ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకురానుంది. దీనికోసం ఢిల్లీ పాఠశాలల్లో అమలు చేసిన నమూనాపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేసవి సెలవుల వరకు ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ వంటి క్రీడల్లో శిక్షణ ఇస్తారు.