విద్యార్థులు సెల్ ఫోన్ పక్కన పెట్టి చదువుపై దృష్టి సారించాలని అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి గిడుగు అప్పారావునాయుడు సూచించారు. గురువారం కసింకోట మండలం బయ్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డిఇఓ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ పట్టుదలతో చదివి లక్ష్యాలను సాధించాలని విద్యార్థులను చైతన్యపరిచారు. తాను సాధారణ రైతు కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు.