అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ లో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రమణను సీపీఎం నాయకులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈసందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. లోకనాధం మాట్లాడుతూ ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మాకవరపాలెం మండలం తూటిపాల గ్రామానికి చెందిన రైతు రమణ తన సమస్యలు పరిష్కరించాలని ఏడాదిగా కోరుతున్న ఎవరు పట్టించుకోలేదన్నారు.