అరకు: అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు

58చూసినవారు
అరకు: అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు
అరకులోయ మండలంలో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ నుంచి పర్యాటకులతో అరకు సందర్శనకు వస్తున్న కారు అదుపుతప్పి బెంజిపుర్ పానిరంగని మధ్య కాలువలోకి దూసుకెళ్లిందని తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పర్యాటకులకు తీవ్ర గాయాలు కాగా 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం వేగమే అని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్