అరకు: పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

65చూసినవారు
అరకు: పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ఫెంగాల్ తుఫాన్ ప్రభావంతో అనంతగిరి మండలంలోని పెదబిడ పంచాయతీ పరిధి చెరుకుమడతలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు బుధవారం కోరారు. ఏడాది వేసిన పంట కోసి నూర్పిడి చేసే సమయంలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి వరి పంటలు నీట మునిగిపోవడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని రైతులు కోరారు.

సంబంధిత పోస్ట్