అరకులోయ మండలంలోని లోతేరు జంక్షన్ నుండి ఉరుములు వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజులుగా కురిసిన భారీవర్షానికి ఉన్న మట్టిరోడ్డు అధ్వానంగా తయారవడంతో ద్విచక్రవాహనం కాదు కనీసం పాదచారులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఉరుములు గిరిజనులు వాపోతున్నారు. ఈ రహదారిపై ప్రయాణం చేయాలంటే సాహసం చేయాల్సి వస్తుందన్నారు. అధికారులు ఈ రహదారి సమస్యపై స్పందించాలని కోరుతున్నారు.