డుంబ్రిగుడ మండలంలోని కితలంగి పంచాయతీ పరిధి కితలంగి కొసంగుడకు మధ్య కొట్టుకుపోయిన కాజ్వేకు నిర్మాణం చేపట్టాలని సిపిఎం నేత పోతురాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన కొట్టుకుపోయిన కాజ్వేను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. కురుస్తున్న భారీవర్షాలకు కాజ్వే కొట్టుకుపోయిందని దీనితో రాత్రుల్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అధికారులు స్పందించి కొట్టుకుపోయిన కాజ్వేకు నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు.