జి. మాడుగుల మండలంలోని బంధవీధి పంచాయతీ పరిధి గ్రామాలకు విద్యుత్ తీగలు పిచ్చి పొదలు అల్లుకొని విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని వినియోగదారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం లైన్మెన్ శ్రీనివాస్ ఆధ్వరంలో విద్యుత్ తీగలకు గుబురుగా అల్లుకుపోయిన పిచ్చి పొదలను గ్రామస్తులు తొలగించారు. దీంతో బందవీధి పంచాయతీ పరిధి గ్రామాల్లో యథావిధిగా విద్యుత్ పునరుద్ధరణ కావడంతో ఆయా గ్రామాల గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.