బాలికల మండల స్ధాయి క్రీడా పోటీలు

77చూసినవారు
బాలికల మండల స్ధాయి క్రీడా పోటీలు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అరకులోయ స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో బాలికల అండర్14,అండర్ 17 మండల స్ధాయి క్రీడా పోటీలు నిర్వహించారు. మండల స్కూల్ గేమ్స్ సెక్రటరీ పాంగి సూరి బాబు, స్పోర్ట్స్ స్కూల్ బ్యాట్మింటన్ కోచ్ రాజుబాబు పర్యవేక్షణలో అథ్లెటిక్స్, జావలిన్ త్రో, షార్టు పుట్, డిస్క్ త్రో, లాంగ్ జంపు, హై జంపు పోటీలు జరిగాయి. మండల స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్ధులు ఈ నెల 23న జరిగే నియోజకవర్గ స్ధాయి పోటీలలో పాల్గొంటారన్నారు. పిడి లు ప్రసాదరావు, అప్పారావు, కామరాజు, శ్రీను తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్