భీమిలిలోని ఆనందపురం మండలంలోని వేములవలసలో ఉన్న ఐఎంఎఫ్ఎల్ డిపోలో దళితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిపో మేనేజరుకు గురువారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సుబ్బన్న, ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాట్లాడుతూ, లోడింగ్, అన్ లోడింగ్ పనుల కార్మికులుగా తీసుకొని ఉపాధి కల్పించాలని కోరారు.