చోడవరం సుగర్స్ పరిధిలో గల చెరకు రైతులకు చెల్లించాల్సిన చెరకుబకాయిల్లో కోటి 20 లక్షల రూపాయలు ఖాతాల్లో జమ చేసినట్టు ఫ్యాక్టరీ ఎండి మీ సన్యాసినాయుడు బుధవారం తెలిపారు. 2023-24 సీజనుకు గాను చెరకు సరఫరా చేసిన రైతు సభ్యులు 14777 మందికి 1 కోటి 20 లక్షల రూపాయలను నేరుగా వారి వారి ఖాతాలలో జమ చేయడమైనదన్నారు. మొత్తం సభ్యులకు ఏడు కోట్ల 16 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా వీడతల వారిగా చెల్లిస్తున్నట్టు తెలిపారు.