బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎం. ఎం. ఎన్. పరశురామరాజు బుధవారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. అధ్యక్షునిగా ఎంపికైనందుకు గంటాతో పాటు ఆయన తనయుడు, టీడీపీ యువనేత గంటా రవితేజలు.. పరశురామరాజును అభినందించి శాలువాతో సత్కరించారు. కొత్త బాధ్యతలను సమర్ధంగా నిర్వహించాలని, కూటమిని బలోపేతం చేసే దిశగా కృషిచేయాలని ఈ సందర్భంగా గంటా అన్నారు.