విశాఖ: ఇంటింటికీ సంపద కాదు... మద్యం సరఫరా: గుడివాడ
చంద్రబాబు ఎన్నికల ముందు సంపద సృష్టి అని చెప్పారని, అంటే రాష్ట్రానికి సంపద సృష్టిస్తారని అందరూ అనుకున్నారని. కానీ మద్యం పాలసీ, వైన్‌షాప్‌ల కేటాయింపు చూసిన తర్వాత, వాస్తవ పరిస్థితి అందరికీ అర్ధమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. కూటమి నేతలకు మాత్రమే సంపద సృష్టించిపనిలో చంద్రబాబు ఉన్నారన్నారు.