విశాఖ ఉక్కు కోసం ఎందాకైనా పోరాడుతామని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పేర్కొన్నారు. బుధవారం విశాఖలోని డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రఘు వర్మ పాల్గొన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకుంటామని స్పష్టం చేశారు.