కార్తీక మాసం సందర్భంగా గాజువాక మండలం కాపు తుంగలాం గ్రామంలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో శనివారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా 69వ వార్డు కూటమి నాయకులు కరణం ముత్యాల నాయుడు చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. ముత్యాల నాయుడుతో పాటు ఆలయ నిర్వహణ కమిటీ, కూటమి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు.