ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 21న 3 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తునట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అనకాపల్లి జిల్లా అధికారి ఎన్. గోవిందరావు ఆదివారం తెలియజేసారు. ఈ ఇంటర్వ్యూలకు పదవ తరగతి, ఐ టి ఐ, డిప్లొమా, డిగ్రీ వరకు చదువుకొని, 18 నుండి 30 సంవత్సరముల వయస్సు గల యువతీ, యువకులు హాజరు కావచ్చు అన్నారు.