నాతవరం మండలం డి. యర్రవరం గ్రామంలో ఆర్. ఎస్. ఎస్. ఆధ్వర్యంలో యువతకు మూడు రోజులు శిక్షణ తరగతులు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేశారు. శిక్షణా తరగతుల్లో శారీరక అంశాలు, యోగా, ఆటలు, పథ్ సంచలన్, సమాజంలో దేశభక్తి, క్రమశిక్షణ తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఎంతో మంది పాల్గొని శిక్షణ తీసుకొని మంగళవారంతో పూర్తి చేసుకున్నారు.