నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో 11 మండలాల్లో రేషన్ దుకాణాలకు 143 దరఖాస్తులు అందినట్లు రెవెన్యూ డివిజన్ అధికారి వివి. రమణ శనివారం ఆర్డిఓ కార్యాలయంలో తెలిపారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి స్వీకరించామన్నారు. ఈనెల 26న రాత పరీక్ష ఉంటుందని, 27న మౌఖిక ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. రాత పరీక్ష జరిగే కేంద్రం, ఇంటర్వ్యూ ప్రదేశం సమాచారాన్ని దరఖాస్తుదారులకు తెలియజేస్తామని చెప్పారు.