నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో బలిఘట్టం సత్యనారాయణస్వామి ఆలయ నిర్వహణ భాద్యతలను అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం స్వీకరించడం హర్షణీయమని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శుక్రవారం అన్నవరంలో శాస్త్రోక్తంగా దత్తత కార్యక్రమంను నిర్వహించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ ఈ ఆలయంలో గల సమస్యలను పరిష్కారం కోసం అన్నవరం దేవస్థానం ఛైర్మన్ రోహిత్ స్పందించి దత్తత తీసుకోవడానికి అంగీకరించారన్నారు.