గొలుగొండ: రిజర్వేషన్ ఐదు శాతానికి పెంచాలి
రెల్లి కులస్తులకు ఒక శాతం ఉన్న రిజర్వేషన్ ను ఐదు శాతానికి పెంచాలని రాష్ట్ర రెల్లి సంఘం అధ్యక్షుడు మంగళగిరి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం గొలుగొండ మండలం ఏఎల్ పురం ఎస్సీ కాలనీలో సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 20 లక్షల జనాభా కలిగిన రెల్లి కులస్తులకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలన్నారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.