విశాఖ: కిట‌కిట‌లాడిన ఆర్టీసీ బ‌స్సులు

77చూసినవారు
విశాఖ: కిట‌కిట‌లాడిన ఆర్టీసీ బ‌స్సులు
సంక్రాంతి ప్రయాణికులతో విశాఖ ఆర్టీసీ ద్వారకా కాంప్లెక్స్‌ శుక్రవారం కిటకిటలాడింది. వివిధ రవాణా సాధనాల ద్వారా విశాఖ వచ్చినవారు, చుట్టుపక్కల గల తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ద్వారకా కాంప్లెక్సుకు చేరుకున్నారు. టిక్కెట్లు జారీచేసే కౌంటర్ల వద్ద బారులు తీరారు. ప్రయాణికుల రద్దీని గుర్తించిన అధికారులు అదనంగా మూడు కౌంటర్లు ఏర్పాటుచేశారు. మొత్తం 174 ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిపిన‌ట్టు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్