జి మాడుగుల మండలం కుంబిడిసింగి గ్రామ పంచాయతీ, జాతీయ రహదారి మత్యపురం నుండి కుంబిడిసింగి మార్గంలో కుంబిడిసింగి వద్దనున్న వాగుపై వంతెన లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సొంత ఖర్చులతో మట్టి పోసి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన కుంబిడిసింగి పరిస్థితి మారదు అంటూ పేసా ఉపాధ్యక్షులు బోయిని వెంకటరామయ్య, సెక్రటరీ సేవ మోహనరావు అవేదన వ్యక్తం చేశారు.