ఏరియా ఆస్పత్రిలో నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

55చూసినవారు
ఏరియా ఆస్పత్రిలో నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్
రంపచోడవరం మండలంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు సోమవారం నాడు డాక్టర్స్ డే సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం హాస్పిటల్ డాక్టర్స్ అందరు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసారు. హాస్పిటల్ సూపరింటెండెంటు కె. లక్ష్మీ మాట్లాడుతూ పశ్చిమబెంగాల్ సీఎం, ప్రముఖ వైద్యుడు బిదాన్ చంద్రరాయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఆయనకు గుర్తుగా జులై 1న డాక్టర్స్ డే జరుపుకోవడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్