రాజవొమ్మంగి మండలం లకవరపాడు గ్రామంలో శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమం గ్రామస్తులు నిర్వహించారు. గ్రామస్థులు సత్తిబాబు బాబు గ్రామంలో నిల్వ కుండీలలో ఉన్న నీటిలో బ్లీచింగ్ చల్లించి యాంటీ లార్వా మందును పిచికారీ చేయించారు. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రతీ ఒక్కరూ దోమ తెరలు వడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.