చెట్లు, వాగులతో కళకళలాడే అల్లూరి జిల్లాలో మార్చిలోనే ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచి సూర్యడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జిల్లాలో అత్యధికంగా పాడేరు 38. 8 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్య ల్పంగా అనంతగిరిలో 31. 1 డిగ్రీలు నమోదు అయ్యిందని వాతావరణం విభాగం నోడల్ అధికారి అప్పలస్వామి తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే రంపచోడవరం - పాడేరుకు వెళ్లే హైవేపై గురువారం ఉ. 10. 30కే అరకొరగా వాహన సంచారం కనిపించింది.