దేవర మద్దతు కోరుతూ

56చూసినవారు
దేవర మద్దతు కోరుతూ
ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ దేవర పోస్టర్లపై విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ స్టిక్కర్లను విశాఖకు చెందిన జన జాగరణ సమితి అతికించింది. విశాఖ ఉక్కు కు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు గురువారం కోరారు. కోట్లాదిమంది అభిమానులు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం వస్తుందని తాము భావిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్